అమిత్ షా, జైట్లీతో ఒమర్ అబ్దుల్లా భేటీ!
జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అన్ని పార్టీలకు తమ తలుపులు తెరిచే ఉన్నాయన్న బీజేపీ ప్రకటనకు ఆ రాష్ట్ర తాజా మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా స్పందించారు. కొద్దిసేపటి క్రితం ఆయన బీజేపీ చీఫ్ అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సహా ఆ పార్టీ కీలక నేత రామ్ మాధవ్ లతో భేటీ అయ్యారు.
ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలేమిటన్న విషయం స్పష్టంగా తేలనప్పటికీ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపైనే చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రజలు తిరస్కరించిన నేషనల్ కాన్ఫరెన్స్ పట్ల బీజేపీ మాత్రం సానుకూలంగానే ఉంది. అధికారం కోల్పోయినా ఆ పార్టీతో పొత్తుకు సిద్ధంగానే ఉన్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.